విశాఖ కామపిశాచి ధన్ రాజ్ పై పిఆర్పీలో చర్చ

ధనరాజ్‌కు టిక్కెట్టు ఇవ్వమంటూ పార్టీ అధినేత చిరంజీవిపై ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఇప్పుడేమంటారు? అంటూ ప్రరాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గెడ్డం బుజ్జి నిలదీస్తున్నారు. విశాఖజిల్లాలో టిక్కెట్లు కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందన్న విషయం ఇప్పటికైనా చిరంజీవి తెలుసుకోగలుగుతారని మరికొందరు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం జిల్లాలో పార్టీ స్థితిగతులపై సమీక్ష జరగకపోయినా, ధనరాజ్ బండారం బట్టబయలు కావడంతో పాపప్రక్షాళనకు ఆపార్టీ నాయకులు సిద్ధమయ్యారు. నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలోని ప్రరాపా కార్యాలయాన్ని ఆపార్టీ నాయకులు ఆదివారం పాలతో శుద్ధిచేయడం విశేషం.












Click it and Unblock the Notifications