తెలంగాణపై కె చంద్రశేఖర రావు మౌనమేలనో...

కెసిఆర్ ఆదివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా కలిశారు. అంతకు ముందు కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, ఎస్ జైపాల్ రెడ్డిలను కలిశారు. తెలంగాణపై కమిటీలు వేయవద్దని, చిదంబరం నేతృత్వంలో చర్చలు చేపడితే ఫరవా లేదని కెసిఆర్ ప్రధానితో చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయవచ్చునని వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన వారి చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సముఖంగానే ఉన్నామని, అయితే అందరికీ నచ్చజెప్పి చేయాలనేది తమ అభిమతమని ప్రధాని కెసిఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో తెలియక కెసిఆర్ సతమతమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్తే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వంటి వారు ఖండించే అవకాశం ఉంది. కేంద్రం వ్యతిరేకంగా ఉందని చెప్తే మొదటికే మోసం వస్తుందేమోననే అనుమానం. ఈ స్థితిలో ఏమీ మాట్లాడలేక ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications