చార్జీలపై ధర్నా: వామపక్ష నేతల అరెస్టు

కాగా, పెంచిన చార్జీలు తగ్దించే వరకు తమ ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసి బస్సు చార్జీల పెంపు ద్వారా సామాన్యులపై భారం వేయడాన్ని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం పతన దిశలో సాగుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్టీసి చార్జీల పెంపుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఆర్టీసిని లాభాల్లో నడపడం ఎలానో తాము చెబుతామని మధు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్టం రావణ కాష్టంలా మండుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications