కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లి గ్రామంలో మావోయిస్టులు శనివారం రాత్రి భారీ ఎత్తున సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. సుమారు 90మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి గ్రామ పెద్దలను మావోయిస్టుల సమావేశానికి పిలిపించి నట్టు తెలుస్తోంది. ఇటీవల కొయ్యూరు, మంప పోలీసులు అరెస్టు చేసిన కన్నవరానికి చెందిన కంకిపాటి లకి, కంకిపాటి రామారావులపై ప్రధానంగా చర్చ సాగిన ట్టు వినికిడి.
ఇద్దరు సానుభూతిపరులు అరెస్టు కావడంపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. వారి అరెస్టుకు దోహదపడిన అంశాలు, కారణాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్టు భోగ ట్టా. అంతేకాక ఈ విషయమై మరికొంత సమాచారం సేకరించేందుకుగాను కొంతమందిని అదేరోజు మండల కేంద్రానికి పంపినట్టు తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి