కావూరి సాంబశివరావుపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు

Sridhar Babu
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చల్లబరిచేందుకు తమ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోందని కావూరి సాంబశివరావు అన్నారు. కావూరి ప్రకటన తెలంగాణ ప్రజలను అవమానపరిచేదిగా ఉందని శ్రీధర్ బాబు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తమకు పదవు కన్నా తెలంగాణనేయ ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కచ్చితంగా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు మద్దతుగా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించాలని కోరుతూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+