హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. సచివాలయంలో వారిరువురి మధ్య భేటీ జరిగింది. వారిరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే తాను రోశయ్యకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వచ్చానని డిఎస్ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సంక్రాంతి పర్వదినం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పండుగ తర్వాత రాష్ట్రంలో చక్కని వాతావరణం నెలకొంటుందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి