వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్ బిఐకి త్వరలో తొలి మహిళా గవర్నర్

భారత రిజర్వ్ బ్యాంక్ ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఆర్‌బిఐది కీలక స్థానమని అదే స్థాయిలో గవర్నర్లు తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని ప్రణబ్ అన్నారు. మరోవైపు రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో కూడా మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ పదవుల్లో ఇంతవరకు మహిళలను ఎంపిక చేయలేదని ఈ సారి చేపట్టనున్న నియామకాల్లో ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్రపతి పేర్కొన్నారు. రాష్ట్రపతి చేసిన సూచనల నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్‌బిఐ గవర్నర్‌గా మహిళను నియమించాలని చూస్తున్నట్లు వెల్లడించటం విశేషం. ప్రస్తుతం ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్లుగా ఉషా తోరట్, శ్యామలా గోపినాథన్ ఉన్నారు.