హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రిలేనిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు రిలేదీక్షలో పాల్గొని సంఘీబావం ప్రకటించారు.
తెలంగాణ రాజకీయ జేఏసీ మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంత్రి జూపల్లి కృష్ణరావు ఆదివారం సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ప్రకియ ఆగిపోయిందని తెలిసిన మరుక్షణమే తాను రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి