వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెప్టెన్ గోపీనాధ్ స్వీయరచన- చదవదగిన పుస్తకం

By Prashanth D
|
Google Oneindia TeluguNews

Air Deccan
జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునే వారికి స్ఫూర్తిని ఇచ్చే పుస్తకం "సింప్లీ ఫ్లై: ఎ డెక్కన్ ఒడిస్సి" ఎయిర్ డెక్కన్ డెక్కన్ వ్యవస్ధాపకుడు కెప్టెన్ గోపీనాధ్ స్వీయ జీవిత చరిత్ర గ్రంధమిది. మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి, ఎడ్లబండిని తోలిన కుర్రాడు కళ్ళల్లో మెరుపులతో ఒక విమానయాన సంస్ధకు యజమానిగా ఎలా ఎదిగాడన్న విషయాలను ఆయన ఎంతో ఆసక్తికరంగా, వాస్తవికంగా రాశారు. భారతదేశంలోని తొలి తక్కువ చార్జీ విమానయానాన్ని ప్రవేశపెట్టి, ఇప్పుడు ఆ రంగంలో నెంబర్ వన్ గా నిలిచిన గోపీనాధ్ గాధ ఇది.

ఈ పుస్తకం వ్యాపారవేత్త విజయగాధ మాత్రమే కాదు, మానవ సంబంధాలకు సంబంధించిన ఉద్వేగభరితమైన అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. అవి చదువరులను సంభ్రమపరుస్తాయి. తనకూ తన తండ్రికీ మధ్య ఉన్న గురు శిష్య సంబంధాన్ని, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు డాక్టర్ గోపీనాధ్. ఈ పుస్తకాన్ని చదువుతుంటే గోపీనాధ్ "జై జవాన్, జై కిసాన్" అని నినదిస్తున్నట్టు ఉంటుంది. ఆయనలో ఒక యుద్ధవిమాన కెప్టెన్ ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు. 1971 భారత్- పాక్ యుద్ధ సమయంలో తన అనుభవాలను కూడా ఆయన ఈ పుస్తకంలో రాశారు.

కెప్టెన్ జిఆర్ గోపీనాధ్ 1970 దశకం చివరి భాగంలో ఎయిర్ ఫోర్స్ నుంచి నెలకు రూ 6,500 పెన్షన్ తో రిటైర్మెంట్ తీసుకుని స్వగ్రామానికి చేరుకుని మళ్ళీ వ్యవసాయంలో ఆనందం అనుభవిస్తుంటాడు. నది పక్కన వ్యవసాయ భూమి. బంజరుగా పడి ఉన్న కొంత భాగంలో పట్టు పరిశ్రమ నెలకొల్పాడు. పట్టు పరిశ్రమలో పట్టుదలకు రోలెక్స్ అవార్డు వచ్చింది. ఆయన అన్వేషణ అక్కడితో ఆగిపోలేదు. ఎయిర్ డెక్కన్ ను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వ్యవస్ధాపించి నాలుగేళ్ళలోనే విమానయాన చరిత్రను తిరగరాశారు. ఈ సంస్ధ అనతి కాలంలోనే 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ కు చేరుకుంది. మూడేళ్ళలోనే డెక్కన్ ఏవియేషన్ 65 డెస్టినేషన్లకు విస్తరించింది. భార్య ఇద్దరు కుమార్తెలతో గోపీనాధ్ బెంగళూరులో నివాసముంటున్నారు.

Buy 'Simply Fly' by Capt. Gopinath @ 30% discount

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X