న్యూఢిల్లీ: ఆరుగురు తెలుగువారికి పద్మా అవార్డులు దక్కాయి. గణతంత్ర దినోత్పవం సందర్భంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డికి, అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డికి పద్మ విభూషణ్ దక్కగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణకు పద్మభూషణ్ దక్కింది. అన్నమాచార్య కీర్తనల గాయని శోభరాజ్ కు, శాస్త్ర ఇంజనీరింగ్ రంగం నుంచి విజయ్ ప్రసాద్ మిమ్రీకి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు, అల్లూరి సత్యనారాయణ రాజు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
మొత్తం 130 మందికి అత్యుత్తమ పౌర పురస్కారాలు పద్మా అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 43 మందికి పద్మ భూషణ్, 81 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నోబెల్ బహుమతి విజేత వెంకట్రామన్ కు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఇళయరాజా, ఎఆర్ రెహ్మాన్, అమీర్ ఖాన్ లకు పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. సెహ్వాగ్, సైఫ్ అలీఖాన్, రేఖలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి