వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూగో జిల్లాలో ప్రజారాజ్యానికి పలువురి రాజీనామాలు

ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో ఆపార్టీ రాజానగరం నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఇన్‌చార్జి అక్కిరెడ్డి మహేష్, జిల్లా కన్వీనర్ సూరపురెడ్డి నారాయణస్వామి, మండల కన్వీనర్ వాసంశెట్టి పెదవెంకన్న ఉన్నారు. తుంగపాడు, దివాన్‌చెరువు ఎంపీటీసీ సభ్యులు కోలపాటి వెంకన్న, మల్లారపు సలోమి, మాజీ ఎంపీటీసీ బలిరెడ్డి అశోక్, మాజీ సర్పంచ్ బండి వీర్రాజు, ఉపసర్పంచ్‌లు కామిశెట్టి విష్ణు, గొల్లి అనంతలక్షీనారాయణ, జంపన రామభద్రరాజు, అబ్బిరెడ్డి వెంకటేశ్వరావు ఉన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై ఏ పార్టీలో చేరేదీ నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.