వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసీస్ లో ఇద్దరు భారత విద్యార్థులపై దాడి

నిందితులు భారత విద్యార్థులపై కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ మెల్బోర్న్ లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం.10.20 నిమిషాలకు ఇద్దరిలో ఒక విద్యార్థిని తోసేసి కింద పడేసినట్లు సమాచారం. ఈ ఘటనలో 18 ఏళ్ల భారత విద్యార్థి ఎడమ చెవి వద్ద గాయమైంది. 22 ఏళ్ల మరో యువకుడిని కూడా కిందికి తోసేసి కొట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై చేసిన వ్యాఖ్యలు జాతిపరమైనవా కావా అనేది తెలియడం లేదు. ఇద్దరు విద్యార్థులను కూడా సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో చేర్చారు.