గుమ్మడి మృతితో ఒంటరివాడినయ్యా: అక్కినేని నాగేశ్వర రావు

Akkineni Nageswara Rao
హైదరాబాద్: గుమ్మడి మృతితో తాను ఒంటరివాడినయ్యానని ప్రముఖ సినీనటుడు, ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు అన్నారు. ఆయన బుధవారం గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుమ్మడి తన జీవితాన్నంతా సినీ రంగానికే అంకితం చేశారని ఆయన అన్నారు. అద్భుతమైన నటుడినే కాకుండా మంచి మిత్రుడిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా బాధాకరమని ఆయన అన్నారు. గుమ్మడి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. గుమ్మడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుమ్మడి అంత్యక్రియలు గురువారం ఎర్రగడ్డలోని ఇఎస్ఐ స్మశానవాటికలో జరుగుతాయని, సినీ పరిశ్రమ అంతా గుమ్మడి అంతియాత్రలో పాల్గొంటుందని ఆయన చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ యావత్తూ గుమ్మడికి నివాళులర్పించడానికి తరలి వచ్చింది. గుమ్మడి భౌతిక కాయం వద్ద సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ బోరున విలపించారు. జుమున, గిరిబాబు, పరుచూరి సోదరులు, మురళీమోహన్ , అలీ, ఆర్ నారాయణ మూర్తి తదితరులు గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుమ్మడి మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. తనకు గుమ్మడి 1972 ప్రాంతం నుంచి తెలుసునని, సత్ప్పవర్తన కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+