తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తా: చిరంజీవి

తెలంగాణలో కూడా తాము ఉద్యమాలు చేస్తామని, తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు వెనకడుగు వేసేది లేదని ఆయన అన్నారు. తమ పార్టీ, తాను ప్రాంతాలకు అతీతంగా ప్రజాదరణ పొందామని ఆయన చెప్పారు. తమ పార్టీని పటిష్టపరిచే విషయంలో జాప్యం జరుగుతున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించుకోలేకపోయినంత మాత్రాన పార్టీ నీరు గారిపోయిందనుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కల్తీసారా ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు. అంబాజీపేటలో కల్తీ సారా తాగి 15 మంది మృతి చెందారు. మరో 70 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుమ్మడి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. గుమ్మడి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications