తూగో జిల్లాలో కల్తీ సారాకు 14 మంది బలి

కల్తీసారా దుర్ఘటనపై ముఖ్యమంత్రి కె. రోశయ్య విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. కల్తీసారా భూతం చుట్టుముట్టిన గ్రామాలకు వైద్య బృందాలను పంపారు. జిల్లా మంత్రులు సుభాష్ చంద్రబోసు, విశ్వరూప్, కలెక్టర్ ద్వివేది, ఎస్పీ నాగిరెడ్డి అమలాపురం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శనివారం సారా తాగిన వారంతా ఆస్పత్రుల్లో చేరాలని అధికారులు సూచించారు. మిథైల్ ఆల్కహాల్ సేవించడం వల్లనే మరణాలు సంభవించాయని కలెక్టర్ చెప్పారు.












Click it and Unblock the Notifications