విభజన పైన రేపు నోరు విప్పుతా: లగడపాటి రాజగోపాల్

Lagadapati Rajagopal
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ విభజనపైన, తెలంగాణవాదుల ఆరోపణలపైన ఈ నెల 28న నోరు విప్పుతానని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ చెప్పారు. చెన్నైలో మంగళవారం సాయంత్రం గజల్‌ శ్రీనివాస్‌కు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి అనంతరం విలేఖరులతో మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ వరకూ మౌనం పాటిస్తానని చెప్పారు.

అందుకే గత రెండు వారాలుగా ఏమీ మాట్లాడటం లేదని తెలిపారు. సాధారణంగా దేశానికి జెండా ఉంటుందని, రాష్ట్రాలకు జెండా ఎక్కడా లేదని, అందుకే గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ వాదులు తెలంగాణ జెండా ఎగురవేస్తామని అనడం బాధ కలిగించడంతో ప్రధానికి లేఖ రాశానని అన్నారు. 29న తెనాలిలో జరుగనున్న సమైక్యాంధ్ర బహిరంగసభకు రాజగోపాల్ వెళ్ళనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అన్ని పార్టీలకు చెందిన కమ్మ నాయకులే నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కోస్తాఆంధ్రలో ఎస్సీలు, వెనుకబడినకులాలవారు ఈ ఉద్యమంపై అంతగా ఆసక్తి చూపుతున్నట్టు కన్పించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+