తెలంగాణ ఉద్యమాలపై రాయపాటి అసహనం

తెలంగాణ ప్రక్రియ అంటే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాదని, తెలంగాణపై ప్రజాప్రతినిధులు, మేధావుల అభిప్రాయాలు తీసుకోవడమే తెలంగాణ ప్రక్రియ ప్రారంభం కావడమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఆ విధంగా చెప్పిందా అని అడిగితే తనతో ఆ విధంగా చెప్పలేదని, వారి ఆలోచన అలా ఉన్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన సమాధానమిచ్చారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చేయడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి తెలంగాణ ప్రక్రియ వెనక్కి పోతుందని ఆయన అన్నారు. ఆందోళనల వల్ల, విద్యార్థుల ఆత్మహత్యల వల్ల ఒరిగేదేమీ లేదని, సాధారణ పరిస్థితులకు ప్రయత్నించడమే తెలంగాణ వాళ్లు చేయాల్సిన పని అని ఆయన అన్నారు. తెలంగాణపై సానుకూలత అంటే ఏమిటని అడిగితే అలా అన్న వారినే అదేమిటో అడగాలని ఆయన అన్నారు. తాను డిఎస్ ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications