శిల్పారామంలో రాసలీలలు టీవీలో ప్రసారం

శిల్పారామంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలన్నారు. టీడీపీ హయాంలో శిల్పారామానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, జనార్దన్‌రెడ్డి రాకతో అవన్నీ పోయాయని విమర్శించారు. ఆయనను తక్షణమే తొలగించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి శోభన్ మాట్లాడుతూ జనార్దన్‌రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటివారిని క్షమించడం తగదన్నారు. ధర్నా చేస్తున్నవారిని మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలం నందు, దేవేందర్, హుస్సేన్, అయిలేష్ యాదవ్, మధుయాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, శ్యాంమోహన్, రాజులతో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. జనార్దన్‌రెడ్డిపై ఏబీఎన్‌లో కథనం రావడంతో పోలీసులు శిల్పారామం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.












Click it and Unblock the Notifications