బ్యాంకు మోసాల చత్వాల్ కు పద్మభూషణ్ పై దుమారం

చత్వాల్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఇటీవలే 90 లక్షల డాలర్ల కుంభకోణంలో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దానిపై ఆయన విచారణ ఎదుర్కొనడంతో పాటు..కొంత కాలం జైల్లో కూడా ఉన్నారు. అయితే చత్వాల్ మాత్రం తనకు ఈ పురస్కా రం ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. "వారం రోజుల క్రితం అమెరికా రాయబారి మీరా శంకర్ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. నన్ను గౌరవించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉంటాను" అని చత్వాల్ చెప్పారు. పద్మ అవార్డు ప్రకటించడంపై వివాదం గురించి ప్రస్తావించగా.. "బీజేపీ అ«భ్యంతరం గురించి నాకు తెలియదు" అన్నారు. తాను భారత్‌ను ప్రేమిస్తున్నానని, 30 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications