ప్రముఖ నటుడు గుమ్మడి కన్నుమూత

Gummadi Venkateswara Rao
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మంగళవారం రాత్రి కన్ను మూశారు. ఆదివారంనాడు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చేరిన గుమ్మడి చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆయనకు 83 ఏళ్లు. ఆయన 500కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన 1927 జులై 9వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు గ్రామంలో జన్మించారు. గుమ్మడికి ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. గుమ్మడి 1940లో లక్ష్మీసరస్వతిని పెళ్లి చేసుకున్నారు.

గుమ్మడి 1942లో ఆయన తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నాడు. ఆయన 1950లో అదృష్టదీపుడు చిత్రం ద్వారా చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆయన చివరి సినిమా ఆయనకిద్దరు. ఆయన పౌరాణికాలు, సాంఘికాలు అన్ని పాత్రలూ పోషించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు 1989లో గౌరవ డాక్టరేట్ వచ్చింది. కులదైవం, మా ఇంటి మహాలక్ష్మి, మాహా మంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మహా మంత్రి తిమ్మరుసుకు ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు. ఆయన ఏడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+