ఢిల్లీకి మమ్మల్ని పిలువలేదు: జానా రెడ్డి

తాము ఢిల్లీలో రెండు, మూడు రోజులుంటామని ఆయన చెప్పారు. సోనియా అడిగితే తెలంగాణలోని పరిస్థితులను, విద్యార్థుల ఆత్మహత్యలను వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని తాము కోరుతామని ఆయన చెప్పారు. కమిటీ వేసినా ఫరవాలేదని, అయితే దానికి కూడా నిర్దిష్టమైన కాలపరిమితి ఉండాలని ఆయన అన్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. రాజీనామాలకు తెలంగాణ జెఎసి గడువు ఈ నెల 28వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు కేశవరావు, హనుమంతరావు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications