హైదరాబాద్: డిజిపిగా గిరీష్ కుమార్ నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) అభిప్రాయపడింది. సీనియారిటీనీ పక్కన పెట్టి డిజిపిగా గిరీష్ కుమార్ ను ఎందుకు నియమించాల్సి వచ్చిందని క్యాట్ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కొత్త డిజిపిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిపి నియామకం నిష్పక్షపాతంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా జరగలేదని క్యాట్ అభిప్రాయపడింది. మాజీ డిజిపిలు ఎస్ఎస్పీ యాదవ్, మొహింతీలకు పూర్తి వేతనం చెల్లించాలని ఆదేశించింది. డిజిపిలుగా ఎస్ఎస్పీ యాదవ్, మొహంతిల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.
డిజిపిగా గిరీష్ కుమార్ ను తాత్కాలిక ప్రాతిపదికపై కొనసాగిస్తూ డిజిపి పదవికి అర్హులైన ముగ్గురి జాబితా రూపొందించి, రెండు వారాల్లోగా నియామకం జరపాలని క్యాట్ సూచించింది. యాదవ్, మొహంతిలకు రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు లేదని తేల్చి చెప్పింది. వారిని ఎక్కడికైనా బదిలీ చేసే అధికారు ప్రభుత్వానికి ఉందని చెప్పింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి