హైదరాబాద్: చిదంబరం తాజా ప్రకటన నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం నేతలతో చంద్రబాబు అత్యవసరంగా భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న నాగం జనార్థన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిదంబరం ప్రకటనపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
చంద్రబాబు నాయుడు మౌలికంగా సమైక్యవాది అన్న పేరుంది. సీమాంధ్రలో తెలుగుదేశం నాయకలు సమైక్య రాగాన్ని ఆలపిస్తున్నారు. తెలంగాణలో మాత్రం తెలుగుదేశం నాయకులంతా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటె తెలుగుదేశం నాయకులే ముందున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి