వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసీస్ లో నలుగురు ఇండియన్లపై దాడి

తాజా సంఘటనల గురించి తమకు సమాచారం అందిందని, కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని భారత కాన్సుల్ ఎస్డీ సింగ్ చెప్పారు. భారతీయులపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత హై కమిషనర్ సుజాతా సింగ్ ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఆమె భారత కమ్యూనిటీ నేతలు, క్వీన్స్ ల్యాండ్ పోలీసులతో చర్చలు జరుపుతారని ఆయన చెప్పారు. భారతీయులు 70 శాతానికి పైగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగాలను దక్కించుకోవడంతో దాడులకు వారు లక్ష్యంగా మారినట్లు భావిస్తున్నారు.
దాడికి గురైన నలుగురిలో ఒకతను 23 ఏళ్ల పిజ్జా డెలివరీ యువకుడు. క్రికెట్ బ్యాట్ తో దుండగులు అతనిపై దాడి చేశారు. 2009లో భారతీయులపై వందకు పైగా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి.