వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పారామంలో రాసలీలల జనార్ధన్ రెడ్డి రాజీనామా

By Santaram
|
Google Oneindia TeluguNews

Shilparamam
హైదరాబాద్‌: శిల్పారామం ప్రత్యేకాధికారి జనార్ధన రెడ్డి రాసలీలలను ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ బయటపెట్ట్టడంతో విధిలేక, సర్కారు ముందు మొహం చెల్లక ఆ యన స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. ప్రభుత్వం గెంటివేయక ముందే తనంతట తాను శిల్పారామం నుంచి బయటపడ్డారు. శిల్పారామంలో జనార్దన్‌ రెడ్డి అరాచకాలను ఆ టీవీ చానల్ వెలికి తీసింది. షాపుల కేటాయింపులు, లీజు పొడిగింపు తదితర అధికారాలను అడ్డుపెట్టుకుని మహిళలపై వల వేస్తున్న విషయం లోకానికి తెలిసింది.

శిల్పారామంలో ఆయన స్పెషల్‌ మసాజ్‌లు, రాత్రిళ్లు బయట బాయ్స్‌ హాస్టల్‌లో శృంగారాలు, మందు ముచ్చట్లు బట్టబయలయ్యాయి. దీంతో బెంబేలెత్తిన జనార్దన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 'ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి'లో తన లీలలు ప్రసారం కాకుండా నిలిపివేయించుకున్నారు. అయితే... అప్పటికే ఈ కథనం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం ఉదయమే దీనిపై ఆరా తీశారు. విచారణ జరపాల్సిందిగా తన పేషీని ఆదేశించారు. పేషీ అధికారులు ఈ బాధ్యతను సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.చెల్లప్పకు అప్పగించారు. చెల్లప్ప వెంటనే రంగంలోకి దిగారు. జనార్దన్‌ రెడ్డిని పిలిపించారు.

అయితే, సచివాలయానికి వచ్చిన జనార్దన్‌ రెడ్డి నేరుగా సీఎం పేషీ అధికారులను కలిశారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసి వివరణ ఇచ్చుకునేందుకు మూడు గంటలపాటు పడిగాపులుకాశారు. అయినా...సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. జనార్దన్‌ రెడ్డి తిరిగి పేషీ అధికారులను కలిశారు. ముఖ్య కార్యదర్శి చెల్లప్పను కలిసి వివరణ ఇవ్వాలని వారు ఆదేశించారు. దీంతో ఆయన చెల్లప్ప వద్దకు చేరుకున్నారు. తన రాసలీలలు నిజమేనని జనార్దన్‌ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది. ఆ వెంటనే ఆయన స్పెషల్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆయన రాజీనామాను ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X