ఫైబర్ బోటు బోల్తా:పలువురు గల్లంతు

బోటు ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులే గల్లంతైనట్లు వార్తా కథనాలు వెలువడుతుండగా, పాపికొండల విహార యాత్రలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రాచలం నుంచి యాత్రికులు వచ్చినట్లు చెబుతున్నారు. బోటు మునిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఎస్పీ మహేష్ భగవత్ చెబుతున్నారు. భద్రాచలం ప్రాంతంలో అంతా గాలించామని, ప్రమాద ఆచూకీ ఏదీ లేదని ఆయన అన్నారు. రెండు ప్రమాదాల గురించి వార్తాకథనాలు వెలువడ్డాయా, ఒకే ప్రమాదం గురించి వెలువడ్డాయా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications