వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్య మంత్రివర్గంలో చేరం: దామోదర్

నాగార్జున విశ్వవిద్యాలయం నంచి పాదయాత్ర చేస్తున్న విద్యార్థి జెఎసి నాయకులను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని ఆయన అన్నారు. సాధారణ పౌరులుగా హైదరాబాద్ వస్తే తమకేమీ అభ్యంతరం లేదని, ఉద్యమకారులుగా వస్తే తిరస్కరిస్తామని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల ద్వారా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన సీమాంధ్ర నాయకులను కోరారు. సమైక్యాంధ్ర నినాదంతో విద్యార్థుల పాదయాత్రను అనుమతించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటేనే అంగీకరిస్తామని ఆయన చెప్పారు. విధివిధానాలు ఖరారైన తర్వాతనే తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 6వ తేదీ తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు.