హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చిన భూమి కోసమే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గొడవ చేస్తున్నాడని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. లగడపాటికి రాజగోపాల్ కు ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దారాదత్తం చేసిందని, దాన్ని కాపాడుకోవడానికే లగడపాటి లడాయి పెడుతున్నాడని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సమావేశానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం దాని అసర్థమతకు నిదర్శనమని ఆయన అన్నారు.
బుధవారం మంచిర్యాల నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన పొడవైన మానవహారం విజయవంతమైందని ఆయన చెప్పారు. జెఎసి ఆధ్వర్యంలో గురువారం రోడ్లపై వంటా వార్పూ, ఆటా పాటా నిర్వహిస్తున్నారు. కమిటీపై ఇప్పుడే ఏమీ మాట్లాడబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వం వేసిన కమిటీ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాలు తెలిసిన తర్వాతనే ఏమైనా మాట్లాడుతామని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి