వైష్ణవి హత్యకేసు మిస్టరీని చేదించిన పోలీసులు?

మరోవైపు వైష్ణవి తల్లి నర్మద చెబుతున్న మాటలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ప్రభాకర్ పేరుమీద ఆస్తులు లేవని, అలాంటప్పుడు వైష్ణవికి ఎక్కడి నుంచి ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీంతో హత్యకు ఆస్తుల వివాదం కారణం కాదనిస్పష్టమవుతోంది. హోంమంత్రి గురువారం విజయవాడ వస్తున్న నేపథ్యంలో కేసు విచారణ పూర్తి చేయడానికి పోలీ సులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి వైష్ణవిని హత్యచేసిన నిందితులను మరోసారి ఘటనా స్థలానికి తీసుకువెళ్లి విచారించారు.
వైష్ణవి హత్యను ఛేదించడంలో సిమ్ కార్డులే కీల కంగా మారాయి. నింది తులు కిడ్నాప్ సమయంలో చేసిన ఫోన్ల ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు ముందు ప్రభాకర్ ఇల్లు ఉన్న ప్రాంతంలోని టవర్,సంఘటన జరిగిన ప్రాంతంలోని సెల్ టవర్ల మధ్య జరిగిన ఫోన్‌కాల్స్ జాబితాలను సేకరించారు. ఆ సమయంలో రెండు సెల్ ఫోన్ల మధ్య సంభాషణలు ఎక్కువ సమయం జరిగినట్లు గుర్తించి వాటి గురించి ఆరా తీసారు.
ఆ నంబర్లు కొత్తగా తీసుకున్నవి కావడంతో, సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశారన్న విషయాన్ని గుర్తించారు. వీటిని అమ్మిన షాపు అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వీటిని వైష్ణవి హత్యకేసులో నిందితులు మోర్ల శ్రీనివాస్, జగదీష్ ఉపయోగించినట్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీని ఆధారంగానే వెంకట్రావుగౌడ్ ను విచారించినట్లు సమాచారం. మొదట ఒప్పుకోకపోయినా అన్ని ఆధారాలను పోలీసులు చూపించడంతో అసలు విషయం ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.