కడప: ఆర్యవైశ్యులకు తనకు పెద్ద తేడా లేదని కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ట్రంకు రోడ్డులో ఆయన కామిశెట్టి అండాలమ్మ, నరసింహులు శ్రేష్టి చారిటబుల్ ట్రస్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు స్థాపించినట్లే తాను కూడా పలు పరిశ్రమలు స్థాపించానని, అందులో వచ్చే కష్టనష్టాలు తనకూ బాగా తెలుసన్నారు. ఆర్యవైశ్యులు తన వద్దకు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా రావచ్చన్నారు. ఆర్యవైశ్యులకు తోడుగా వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని తనపై వారు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ తనకు స్నేహితులందరూ ఎక్కువగా వైశ్యులే ఉన్నారని వారు రాజకీయాల్లో తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అవకాశం ఉన్నచోట సీట్లిచ్చి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ బ్రతికుండగా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ఆర్యవైశ్య ట్రస్టులను వారే పరిపాలించుకునేలా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ కుటుంబాన్ని తామెన్నడూ మరచిపోమన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి