వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాయంత్రంలోగా జెఎసి తేల్చాలి: ఈటెల

తాము జెఎసి సమావేశానికి హాజరవుతామని, తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకే రాజీనామాల విషయంలో గడువులు పెంచుతూ వచ్చామని, శ్రీకృష్ణకమిటీ విధివిధానాలు చూసిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని కాంగ్రెసు నాయకులు చెప్పడంతో ఇంత కాలం ఆగామని ఆయన చెప్పారు. విధివిధానాలు తెలంగాణ ప్రజల కంట్లో మట్టి కొట్టే విధంగా ఉన్నాయని, దీంతో పదేళ్లుగా ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చిన పార్టీగా తమపై ఎక్కువ బాధ్యత ఉందనే తలంపుతో రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని, తమకు ప్రజలే హైకమాండ్ అని, ప్రజల అభిప్రాయం మేరకు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని కోదండరామ్ చెప్పడంతో రేపటి వరకు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని ఆయన చెప్పారు.