గుంటూరు: రాష్ట్రంలో వేర్పాటు వాదంపై ఒక ప్రముఖస్వామి నోరు విప్పారు. రాష్ట్రంలో ప్రత్యేకవాదం నాయకుల సృష్టేనని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. గ్రామాల్లోకి వెళ్లి తెలంగాణ వాదంపై మద్దతు సాధించి, ఆ తరువాత ఉద్యమాలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. ఉద్యమం పేరుతో విద్యార్థుల భవిష్యత్‌ని పాడుచేయవద్దని కోరారు.
దేశంలో మతమార్పిడులు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకుంటామని జయేంద్ర సరస్వతి చెప్పారు. అనేక కేసుల్లో కొందరు రాజకీయ నాయకులు ఈయనను ఇరికించినా ఆయన విజయవంతంగా బయటికి వచ్చారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి