హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ హెచ్‌ఆర్‌సీకి స్పష్టంచేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన కేసులో మానవహక్కుల కమిషన్ ఎదుట ఖాన్ హాజరు అయ్యారు. హైకోర్టు సూచన మేరకు ఓయూలో కేంద్ర బలగాలను ఉపసంహరించుకున్నామని కేవలం రాష్ట్ర పోలీసులే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారని చెప్పారు.
ఇలా ఉండగా ఉస్మానియా ఘటనపై వారంలోగా నివేదిక ఇస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో చెప్పారు. ఉస్మానియా సంఘటనపై హైకోర్టు సీరియస్ కావడం, డిజిపిని ఆక్షేపించడం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి