హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కార్యకలాపాలను, సరుకు రవాణాను ఆపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి జీవోలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సిఇసి నివేదికను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి