బెంగళూరు: ఈనెల 27న నమ్మ బెంగళూరు అవార్డులను ప్రకటించనున్నారు. వివిధ రంగాల్లో, వివిధ ప్రాంతాల్లో సేవ చేస్తున్న బెంగళూరు స్ధానికులకు ఈ అవార్డులను ఇస్తారు. నగరంలో సామాన్యుల జీవితాన్ని అసామాన్యంగా మార్చడానికి విశేష కృషి చేసిన వారిని సత్కరించుకోడానికే పార్లమెంటు సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ అవార్డులను ప్రవేశపెట్టారు. ఈ అవార్డులు సేవారంగంలో ఉండి గుర్తింపు పొందని సామాన్యుల కోసం ఉద్దేశించారు.
ఈ అవార్డులను ఏటా ఇస్తారు. లాభాపేక్షలేని నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఈ అవార్డులను ఇస్తోంది. నమ్మ బెంగళూరు అవార్డులను కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్ చేయవచ్చు. పన్ను మినహాయింపు లభిస్తుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి