తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిపాలనా భవనం వద్ద శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూనిర్వాసితులు తమకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ 48 గంటల టిటిడి పరిపాలనా భవం దిగ్బంధానికి దిగారు. వారికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూనిర్వాసితుల తరఫున పోరాటం చేయడానికి ఐక్య పోరాట కమిటీని ఏర్పాటు చేశాయి. టిటిడి యాజమాన్యంతో భూనిర్వాసితులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
చర్చలు విఫలమైన నేపథ్యంలో భూనిర్వాసితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పలువురు మహిళలున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ సమస్య పరిష్కారానికి భూనిర్వాసితులు గత 21 రోజులుగా టిటిడి పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు. 48 గంటల ముట్టడికి పూనుకున్న భూనిర్వాసితులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి