శాంటియాగో: చిలీలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. చిలీ రాజధాని శాంటియాగోకు 450 కిలోమీటర్ల దూరం ఈ భూకంపం చోటు చేసుకుంది. దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 52 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని శాంటియాగోలో కూడా ఇళ్ల గోడలు బీటలు వారాయి. భూకంపం వల్ల 47 మంది మరణించినట్లు అంతకు ముందు చిలీ అధ్యక్షుడ మైచెల్లే బాచెలెట్ చెప్పారు. టెలిఫోన్ లైన్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, చిలీ, పెరూ, ఈక్వెడార్ ల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూకంప తీవ్రత సునామీ ప్రమాదాన్ని సూచిస్తోందని సునామీ వార్నింగ్ కేంద్రం తెలిపింది. చిలీలో 59.4 కిలోమీటర్ల లోతులో భారత కాలమాన ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి