హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని తాము బహిష్కరిస్తామని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. చట్టబద్దత లేనందున శ్రీకృష్ణ కమిటీ వల్ల ప్రయోజనం ఉండదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగలదా అని ఆయన అడిగారు. రాష్ట్ర భవిష్యత్తును శ్రీకృష్ణ కమిటీ నిర్ణయించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఆయన అన్నారు. ఇది వరకు వేసిన ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య కమిటీలు ఏమీ చేయలేకపోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ కూడా ఏమీ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి