సోనియా నాపై విశ్వాసం ఉంచారు: సిఎం

Rosaiah
ఏలూరు: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో మరింత మెలుకువగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళలకు 202 కోట్ల రూపాయలు ఆయన మంజూరు చేశారు. స్కూల్ అసిస్టెంట్ భాషా పండిత పోస్టులను భర్తీ చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు నిరసన తెలిపారు. త్వరలోనే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని ఆయన చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. సుప్రీంకోర్టును ఒప్పించైనా కొల్లేరు ప్రజలకు త్వరలో శాశ్వత పరిష్కారం కల్పిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ హామీ ఇచ్చారు. మార్చి చివరకు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా వస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+