న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మార్చి 4న హైదరాబాదు రానుంది. మార్చి 4,5 తేదీల్లో కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తారు. తిరిగి 5వ తేదీ సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్తారు. ఈ పర్యనటలో వారు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమవుతారు. కమిటీపై అపోహలు, అనుమాలు తొలగించడానికి వారు ఈ పర్యటనలో పర్యటిస్తారు. కమిటీ విధివిధానాలపై, లక్ష్యాలపై వారు రాజకీయ పార్టీల నాయకులతో చర్చిస్తారు.
కమిటీ సభ్యులు రాజకీయ పార్టీలతో సుహృద్భావ సమావేశాలు జరుపుతారు. కమిటీ లక్ష్యాలను, పని విధానాలను రాజకీయ పార్టీల నాయకులకు వివరిస్తారు. కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో ఈ విషయం చెప్పారు. కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ఇది వరకే హైదరాబాదు వచ్చి కమిటీ సమావేశాలకు అనువైన భవంతి కోసం చూసి వెళ్లారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి