ముంబయి: గతేడాది నవంబరులో 'ముంబయి అందరిదీ' అంటూ సచిన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించిన శివసేన ఇప్పుడు అతనికి అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సచిన్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ప్రభత్వానికి లేఖ రాయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇక వన్డేల్లో డబుల్‌సెంచరీ సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు భారత రత్న ఇవ్వాలని అన్ని వర్గాల నుంచీ భారీ ఎత్తున వినిపిస్తోంది. రెండు రోజుల కిందట మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ సచిన్‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత రత్నకు మాస్టర్ అర్హుడేనంటూ కపిల్‌దేవ్ కూడా మద్దతు తెలిపారు.