వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకాభిప్రాయ సాధనకే శ్రీకృష్ణ కమిటీ: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై విస్తృతస్థాయి ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అందుకే శ్రీకృష్ణ కమిటీని వేశామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం కాలయాపన చేస్తోందని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు గురువారం చేసిన వ్యాఖ్యపై ప్రధాని ఆ విషయం చెప్పారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల్లో స్టేక్‌హోల్డర్ల మధ్య భిన్నాభిప్రాయాలు లేవన్నారు. తెలంగాణ విషయం అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తెలుసుకుని విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఒక పరిష్కారానికి మార్గదర్శక ప్రణాళికను, భవిష్యత్ కార్యాచరణను కమిటీ గుర్తిస్తుందని, 2010 డిసెంబర్ 31 నాటికల్లా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.

అణచివేతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించుకున్నా, బేషరతుగా హింసను వదిలిపెట్టిన ఏ వేర్పాటువాద సంస్థతోనైనా చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆయా సంస్థలు రాజ్యాంగ ప్రక్రియకు కట్టుబడి ఉంటామని అంగీకరించాల్సి ఉంటుందన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో చర్చించి మావోయిస్టు సమస్యను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. మావోయిస్టులు కొన్నిచోట్ల చిన్నారులను కూడా ఉపయోగించుకుంటున్నట్లు తమకు నివేదికలు అందాయని, నక్సల్ హింసను అణచి వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో తాజా పరిస్థితని సమీక్షించామని, మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలు గణనీయ విజయాలు సాధించాయని కితాబిచ్చారు.

ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ముఖ్యమైన ఈ బిల్లుకు మద్దతివ్వాలని ప్రధాని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. "మహిళా బిల్లును మేం 2008 మేలో రాజ్యసభలో ప్రవేశపెట్టాం. ఈ బిల్లుపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికను కూడా మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ బిల్లుకు సభ్యులు మద్దతిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మహిళల సాధికారతకు మనం కట్టుబడి ఉన్నామని బలంగా చెప్పుకోడానికి ఇది ఉపకరిస్తుంది" అని ప్రధాని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X