నాకేం కొమ్ములు మొలవలేదు: రోశయ్య

స్పీకర్, ఇతర సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతనే తాను వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, సభ్యులపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. సభలో సభ్యులందరినీ తాను గౌరవిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని అయినందుకు తనకేమీ కొమ్ములు మొలవలేదని ఆయన అన్నారు. స్పీకర్ పట్ల అగౌరవంగా ప్రవర్తించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications