ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసు రిక్రూట్ మెంటులో తొక్కిసలాట చోటుచేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ముంబైలోని కలినా ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిక్రూట్ మెంటు కోసం పది వేల మంది దాకా అభ్యర్థులు వచ్చారు. గేటు తెరవగానే ఒక్కసారిగా లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
ముంబైలోని ఐదు కేంద్రాల్లో 3,200 పోలీసులు నియామకం కోసం అభ్యర్థులను పిలిచారు. దాంతో పెద్ద యెత్తున అభ్యర్థులు వచ్చారు. తొక్కిసలాట జరిగిన రెండు గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాంతో నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది.