మైనంపల్లి రాజీనామా ఉపసంహరణ

మైనంపల్లి హనుమంతరావు ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలోని విఐపి రిజర్వ్ డ్ లాంజ్ లో తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ సాధన కోసం తాను రాజీనామాను చేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసి తన స్థానంలో తెలంగాణ కోసం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తాజా మాజీ శాసనసభ్యులు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తమ స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే తెలంగాణకు చెందిన 39 మంది తెలుగుదేశం సభ్యులు రాజీనామా చేసి అదే విధంగా చేస్తామంటే తాము సిద్ధంగా ఉంటామని తెరాస నాయకులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications