హైదరాబాద్: తెలుగు చలన చిత్ర దర్శకుడు తేజను ఈ నెల 17వ తేదీలోగా తమ ముందు ప్రవేశపెట్టాలని మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎసిపిని ఆదేశించారు. తేజ మామ పద్మనాభ రెడ్డిని కూడా తమ ముందు హాజరు పరచాలని ఆయన బుధవారం ఆదేశించారు. ఇంటి వివాదంలో నిర్మాత చదదలవాడ శ్రీనివాస రావు కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
తేజ తనపై దౌర్జన్యానికి పాల్పడినట్లు శ్రీనివాసరావు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. తేజకు సంబంధించిన ఇంటి విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.