న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్లు చెల్లవంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. మతప్రాతిపాదికపై రిజర్వేషన్లు చెల్లవంటూ హైకోర్టు ఆ తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
కర్నాకట మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) యథావిధిగా మైనింగ్ చేసుకోవచ్చునని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.