తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యసేవలను పర్యవేక్షించే రంగనాథ పెదజీయర్‌స్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు.
ఆయన భౌతికకాయాన్ని తితిదే పాలకమండలి అధ్యక్షులు ఆదికేశవులునాయుడు సందర్శించి నివాళులర్పించారు. తితిదే సంప్రదాయప్రకారం సాయంత్రం పెద్దజీయర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.