వరంగల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య

Warangal
వరంగల్: వరంగల్ జైలులో మంగళవారం ఓ అండర్ ట్రయల్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింహులు అనే ఆ ఖైదీ జైలులోని ఎల్లోరా బ్లాక్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. పై నుంచి దూకిన వెంటనే నర్సింహులును అధికారులు వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అయితే నర్సింహులు కళ్లు తిరిగి పడిపోయాడని జైలు అధికారులు చెబుతున్నారు.

నర్సింహులు వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపురం గ్రామవాసి. నిరుడు అక్టోబర్ లో జరిగి ఒక హత్య కేసులో అతను విచారణను ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో విచారణ తుది దశకు వచ్చింది. తనకు శిక్ష పడుతుందనే భయంతో నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అతనికి 23 ఏళ్ల వయస్సుంటుంది. అతని వ్యక్తిగత వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+