విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్య

Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పర్యాటక శాఖకు చెందిన పున్నమి రిసార్టులో ప్రేమికులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులను పల్లవి, శరత్ గా గుర్తించారు. వీరు ప్రకాశం జిల్లా ఉల్లవపాడుకు చెందినవారు. పల్లవికి వివాహమైంది. ఆమెకు పిల్లలున్నారు. శరత్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు గురువారం రాత్రి విజయవాడకు వచ్చి పున్నమి రిసార్టులో దిగారు.

కాలేజీ రోజుల్లో వారిద్దరు ప్రేమికులను తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మాట్లాడుకోవడానికో, మరి దేనికో విజయవాడలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టారు. తాము జీవితంలో ఎప్పుడూ కలవలేమనే నిరాశను ఆ లేఖలో వారు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+